Delhi: బంగ్లాదేశ్ హిందువులపై అకృత్యాలు జరుగుతున్న నేపథ్యంలో హజ్రల్ నిజాముద్దీన్ దర్గా ప్రాంతంలోని మతపెద్దలు, నివాసితుల ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను గుర్తించి స్వదేశానికి పంపించేందుకు స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టాలని కోరినట్లు రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: PM Modi: ప్రధాని మోడీని చంపేస్తామని బెదిరింపులు..
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై ప్రతినిధి బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సక్సేనాకు సమర్పించిన లేఖలో బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి, ఆ దేశంలోని ఇతర పరిస్థితులు ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులపై కఠిన చర్యలను డిమాండ్ చేస్తూ, వారికి ఏ సంస్థలో ఉద్యోగాలు, వసతి కల్పించరాని ప్రతినిధి బృందం కోరింది.
అలాంటి వ్యక్తులు ప్రభుత్వ భూమి, ఫుట్‌పాత్‌లు, పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ని ఆదేశించాలని కూడా పేర్కొంది. ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డుల వంటి ఏవైనా అధికారిక పత్రాలను జారీ చేసినట్లయితే, వాటిని వెంటనే రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఏదైనా మతపరమైన స్థలంలో ఆశ్రయం కల్పిస్తే వారిని ఖాళీ చేయించాలని పేర్కొంది. అటువంటి చొరబాటుదారుల్ని గుర్తించి వారిని తిరిగి బంగ్లాదేశ్ పంపించడానికి ప్రత్యేకమైన డ్రైవన్ నిర్వహించాలని ప్రతినిధి బృందం కోరింది.
