NTV Telugu Site icon

Pakistan: ఉత్తర్‌ప్రదేశ్‌లో పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ పూర్వీకుల భూమి వేలం..

Musharaf

Musharaf

Pakistan: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని బాగ్‌పత్‌ జిల్లా బడౌత్‌ తహసీల్‌లోని కొటానా గ్రామం దగ్గర గల పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పూర్వీకుల భూమి రెండు హెక్టార్లను 1. 38 కోట్ల రూపాయలకు వేలం వేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, ఈ భూమిని 2010లో ‘శత్రు ఆస్తి’గా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశంలో పాకిస్థానీ పౌరుల యాజమాన్యం కింద ఉన్నవాటిని శత్రు ఆస్తుల వర్గీకరణగా వీటిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ విభాగం నిర్వహిస్తుంది.

Read Also: Leopard Hulchul: చిరుత పులి సంచారం.. అప్రమత్తమైన అటవీశాఖ

ఇక, పాకిస్థాన్‌ మాజీ మిలటరీ చీఫ్‌ ముషారఫ్‌ 1999 తిరుగుబాటు తర్వాత పాకిస్థాన్ లో అధికారాన్ని దక్కించుకున్నారు. దేశ విభజనకు ముందు ఢిల్లీలో జన్మించిన ఈయన 2023లో చనిపోయారు. ముషారఫ్‌ తాత కొటానా గ్రామంలో జీవనం కొనసాగించారని బడౌత్‌ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అమర్‌ వర్మ ధ్రువీకరించారు. వీరి కుటుంబానికి బడౌత్ జిల్లాలో ఉమ్మడి ఆస్తి ఉందన్నారు. ముషారఫ్‌ మామ హుమయూన్‌ నివసించిన ఇల్లు కూడా గ్రామంలోనే ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇక్కడ ఉన్న భూమిని రూ.39. 06 లక్షల ప్రాథమిక ధరతో వేలం వేయగా రూ.1.38 కోట్ల ధర పలికింది. ఈ సొమ్మును హోంశాఖ ఖాతాలో జమ చేస్తామని అధికారులు వెల్లడించారు.

Show comments