NTV Telugu Site icon

Muralidhar Rao: బీబీసీ దుష్ప్రచారం చేసింది.. ఎటాక్ చేయకుండా ఎలా ఉంటాం?

Muralidhar Rao On Bbc

Muralidhar Rao On Bbc

Muralidhar Rao On BBC Raids And CM KCR: బీబీసీ ఈడీ సోదాలపై తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ప్రధాని మోడీని దెబ్బతీయడమే కాదు, హిందూ సింబల్స్‌పై కూడా దుష్ర్పచారం చేసిందని మండిపడ్డారు. అలాంటి బీబీసీపై ఎటాక్ చేయకుండా ఎలా ఉంటామని అన్నారు. భారత ప్రజలకు వ్యతిరేకంగా బీబీసీ ప్రసారాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీలో ఎంతమంది చేరినా.. కాంగ్రెస్ పార్టీలా మారదని స్పష్టం చేశారు. ఎందుకంటే.. తమ పార్టీలో చేరిన వారికి ఏదో ఒక బాధ్యత అప్పగిస్తామని తెలిపారు. ఒరిజినల్ క్యాడర్ ఎక్కడ ఇబ్బంది పడటం లేదని క్లారిటీ ఇచ్చారు.

Vijay Shah: ‘బొక్కలు విరుగుతాయ్’..గోడు చెప్పుకొన్న వ్యక్తిపై మంత్రి చిందులు

ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, రెడీ ఉన్నానని పేర్కొన్న మురళీధర్.. పార్టీ పోటీ చేయమంటే, అసెంబ్లీకి పోటీ చేస్తానన్నారు. ఇక రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా బూమరాంగ్ అవుతోందని, రివర్స్‌లో ఆయనకే దెబ్బపడుతోందని అన్నారు. కర్ణాటకలో వచ్చే ఎన్నికలు బీజేపీకి ఛాలెంజింగ్‌గా మారుతాయని, ఎందుకంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. కర్ణాటక.. కుల ప్రాతిపదిక ఓరియెంటెడ్ స్టేట్ అని అభివర్ణించారు. కేసీఆర్ కంటే యడ్యూరప్ప పెద్ద లీడరని తెలిపారు. తెలంగాణలో ఎంఐఎం నట్, బోల్టులన్నీ కేసీఆర్ దగ్గరే ఉన్నాయన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ప్రభావం అంతగా లేదని, వాటికి పెద్దగా ఓటు బ్యాంకు లేదని తేల్చి చెప్పారు.

KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా

అంతకుముందు.. తెలంగాణ ప్రభుత్వం విక్రమాదిత్య నాటక ప్రదర్శనను ప్రోత్సహించాలని మురళీధర్ కోరారు. తెలంగాణలో సినీ ప్రభంజనం పెరిగిందని, నాటక ప్రదర్శలు చాలా తగ్గాయని అన్నారు. ప్రస్తుత తరానికి నాటకల గురించి తెలియదన్నారు. ప్రధాని మోడీ ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్‌కు పిలుపునిచ్చారన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విక్రమాదిత్య చరిత్రను అన్ని రాష్ట్రాలకు తెలియజేస్తుందని.. మన రాజుల చరిత్రను మనం తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. 2000 ఏళ్ల క్రితం విక్రమాదిత్య శకం నడిచిందన్న ఆయన.. విక్రమాదిత్య గొప్పతనం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు.