తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరు జరుగుతోంది. తమిళనాట మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 21 కార్పొరేషన్లు, 130 మునిసిపాలిటీలు, 490 నగర పంచాయతీలకు ఒకే దశలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
బరిలో ఏఐఎడీఎంకే, డీఎమ్‌కే, నటుడు విజయ్ సంబంధించిన మక్కల్ ఇయాక్కం పార్టీలు తలపడుతున్నాయి. సాలిగ్రామం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నీలాంగరి పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు నటుడు విజయ్. ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కబర్చారు.
