Zika virus: ఒకేసారి డెంగీ, మలేరియా, లెప్టో వ్యాధులు సోకి ఒక బాలుడు ముంబైలో మరణించాడు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో జికా వైరస్ కలకలం మొదలైంది. ముంబైలో రెండో వైరస్ కేసుల నమోదైంది. 15 ఏళ్ల బాలిక జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి జికా వైరస్ గా తేల్చారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముంబైలో రెండో జికా వైరస్ కేసు నమోదైందని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం తెలిపింది. అంతకుముందు ఆగస్టు 23న తొలి కేసు నమోదైంది.
తూర్పు ముంబైలోని కుర్లాకు చెందిన 15 ఏళ్ల బాలికకు జికా వైరస్ కోసినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి తాలూకు లక్షణాలతో బాధపడుతున్న బాలిక ఆగస్టు 20న జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న బాలిక మొదటగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తరువాత ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
Read Also: Rishi Sunak: ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమే.. కానీ..
జికా వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మహిళలకు గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంది. జ్వరం, శరీంపై దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు జికా వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. జికా వ్యాధికి వ్యాక్సిన్ లేదు. దీనికి సరైన మందులు కూడా లేవు. అయితే లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తారు. అంతకుముందు చెంబూర్ కు చెందిన 79 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
