PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెల్లవారుజామున ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి మెంటల్‌గా సరిగా ఉన్నాడా.? మద్యం మత్తులో ఉన్నాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ముంబై ట్రాఫిక్ పోలీసులకు హెల్ప్‌లైన్‌కి గతంలో సల్మాన్ ఖాన్‌ని చంపేస్తాంటూ కూడా బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి.