ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతామని బెదిరించమని తనకి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చెప్పినట్టు తెలిపాడు. అలాగే ముంబై జేజే హాస్పిటల్ కూడా బాంబు బెదిరింపు కాల్ చేయమని చెప్పినట్టు కూడా వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి భారతీయ శిక్షా స్మృతి కింద 505 (2) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: Maxico : మెక్సికోలో కాల్పులు.. ఇద్దరు పోలీసులతో సహా 9 మంది మృతి
ఇదిలా ఉంటే గత అక్టోబర్ నెలలో ముంబై పోలీసులకు ఓ బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందులో భారత ప్రభుత్వం రూ. 500 కోట్లు చెల్లించకపోయినా, గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని విడుదల చేయపోతే ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అతడి పేరు మీద ఉన్న నరేంద్రమోదీ స్టేడియాన్ని పేల్చివేస్తామంటూ ఓ వ్యక్తి బెదింపు మెయిల్ పంపాడు. అంతేకాదు ఇప్పటికే తమ ఉగ్రవాదుల గ్యాంగ్ భారత్‌లో అడుగుపెట్టిందని, ముంబైలోని పలు ప్రాంతాలను పేల్చేస్తారంటూ బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసుల బలగాలు అక్టోబర్ 7న అతడిని ట్రేస్ చేసిన పట్టుకున్నారు. అతడు గోర్‌గావ్ చెందిన నాగేంద్ర శుక్లాగా పోలీసులు గుర్తించారు. ఇది ఓ ఫ్రాంక్ మెయిల్ అని, మద్యం మత్తులో అతడు ఈ బెదిరింపుల కాల్స్ మెయిల్స్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read: Satya Nadella : మైక్రోసాఫ్ట్ AI రీసెర్చ్ టీమ్‌ని ఇక వీరిద్దరే లీడ్ చేస్తారు.. సీఈవో సత్య నాదెళ్ల