Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ఇటీవల కాలంలో దేశంలో మార్మోగిపోతుంది. ఈ సమయంలో ఒక కీలక పరిణామం జరిగింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ గురించి అమెరికా అలర్ట్ చేయడంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అతడిని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నాలను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. దీంతో పాటు బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన కేసులో అన్మోల్ ని అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు యత్నిస్తున్నారు.
Read Also: Paragliding World Cup: నేటి నుంచే పారాగ్లైడింగ్ ప్రపంచకప్.. 32 దేశాల నుండి ఆటగాళ్లు
ఇక, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కి సంబంధించిన కేసుల ప్రత్యేక న్యాయస్థానం బిష్ణోయ్ అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు యాంటీ టెర్రర్ ఏజెన్సీ గత నెలలో తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతడిని అరెస్ట్ చేస్తే రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని వెల్లడించింది. కాగా, బిష్ణోయ్ గ్యాంగ్ యొక్క హిట్ లిస్ట్ లో ఉన్న బాలీవుడ్ నటుడిని భయపెట్టడానికి ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి బయట బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ కేసులో అన్మోల్ బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌లను ముంబై పోలీసులు నిందితులుగా చేర్చారు.