Site icon NTV Telugu

BMC Election 2026: ముంబైలో కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీరే!

Bmc3

Bmc3

ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ముంబై మున్సిపల్ ఎన్నిలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు చాలా ప్రముఖ్యత చోటుచేసుకుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లోల విచిత్రమైన పొత్తులు జరిగాయి. 20 సంవత్సరాలకు పైగా దూరంగా ఉన్న థాక్రే సోదరులు కలిసి పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు మహాయతి కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారా? అన్న సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. అన్ని పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, నటుడు అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక అంధేరిలోని లోఖండ్‌వాలాలో నటి సాన్య మల్హోత్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇది కూడా చదవండి: Trump: మా బెదిరింపులతో ఇరాన్‌లో హత్యలు ఆగాయి.. ట్రంప్ ప్రకటన

ముంబైతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. మొత్తం 1,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10.3 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు జనవరి 16న విడుదల కానున్నాయి. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Exit mobile version