ఓ వ్యక్తి ఏడు నెలల క్రితం రూ.20 దొంగతనం చేశాడు. ఈ కేసులో మహారాష్ట్ర కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగతనం కేసులో మూడేళ్ల జైలు శిక్ష ఎంటని షాక్ అవ్వకండి. దొంగతనం చేసే సమయంలో బాధితుడికి గాయాలయ్యాయి. ఏడేళ్లుగా జైలులో నిందితుడు ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో తాను నేరం చేసినట్టుగా ఒప్పుకుంటూ కోర్టుకు లేఖ రాశాడు. నేరం ఒప్పుకోవడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఐపీసీ చట్టాల ప్రకారం దొంగతనం సమయంలో బాధితుడు గాయపడితే గరిష్టంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నది. నేరాల తీవ్రతను బట్టి యావజ్టీవ కారాగార శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది.
రూ.20 దొంగతనంః మూడేళ్ల జైలు శిక్ష…
