NTV Telugu Site icon

Viral Video : ఓరి నాయనో.. అది బైక్ నా.. లారీనా..

Mumbai Video

Mumbai Video

సాదారణంగా బండి మీద ఒకరు,ఇద్దరు, లేదా ముగ్గురు వెళ్లడం తరచు మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక స్కూటర్‌పై ఏకంగా 8 మందిని తీసుకొని వచ్చాడు.. ఒక స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.. ఆ వీడియో ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు..

విషయానికొస్తే.. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు మొత్తం 7 మంది పిల్లల ను స్కూల్ నుంచి ఈ స్కూటర్‌పై తీసుకొచ్చి దింపుతున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు మునవర్ షాను అరెస్ట్ చేశారు. భారీ జరిమాన కూడా విధించారు. మునవాష్ షాకు నలుగురు పిల్లలు. మానవాష్ షా ముగ్గురు పిల్లల ను ఇరుగుపొరుగు ఇంటి నుండి పాఠశాలకు తీసుకువెళతాడు. మునవర్ షా నగరంలో ని ప్రధాన రహదారిపై 7 మంది పిల్లలతో స్కూటర్‌పై వెళ్తుండగా కొందరు వీడియో తీశారు… అంత మంది పిల్లలను తీసుకెళ్లిన అతను జాగ్రత్తగా లేకపోవడం అందరికి కోపాన్ని కలిగిస్తుంది.. హెల్మెట్ లేకపోవడం తో అందరు అతన్ని తిడుతున్నారు.

అంతమంది పిల్లలతో వెళ్తున్నాడు కనీసం అతను ఇలాంటివి ఎందుకు మర్చిపోయాడు అంటూ వీడియో చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో ఆ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు యాక్టివ్ అయ్యారు. సీసీటీ ఫుటేజీ ఆధారంగా మునవర్‌ ను అదుపు లోకి తీసుకున్నారు. మునావర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీ జరిమానా విధించారు. పిల్లల భద్రత, ట్రాఫిక్ భద్రత, ట్రాఫిక్ నిబంధనలు అన్నీ స్కూటర్ రైడింగ్ తో గాలికి వదిలేశాడు..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. దీంతోపాటు ఖరీదైన జరిమానాలు విధిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, వన్ వే రైడింగ్ సహా ట్రాఫిక్ రూల్స్ ను పక్కన పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..