Husband killed his wife for not wearing a burqa: ఓ వైపు హిజాబ్ వద్దు అంటూ కరడుగట్టిని ఇస్లామిక్ దేశం ఇరాన్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే యువతి హిజాబ్ ధరించనుందుకు పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తరువాత అమ్మాయి చనిపోవడంతో అక్కడి యువత, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మనదేశంలో మాత్రం కొంతమంది ఇష్టం లేకున్నా హిజాబ్, బురఖా వంటి వాటిని మహిళలపై రుద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్
తాజాగా ముంబైలో ఓ టాక్సీ డ్రైవర్ బురఖా ధరించలేదని విడిపోయిన భార్యను చంపాడు. తన భార్య బురఖా వేసుకోవడం లేదని.. అందుకే చంపానని పోలీసుల విచారణలో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన ఇక్బాల్ షేక్ కు హిందూ యువతి రూపాలితో మూడేళ్ల క్రితం 2019లో వివాహం అయింది. వివాహం తరువత రూపాలి తన పేరును జరినాగా మార్చుకుంది. 2020లో వీరిద్దరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్త ఇక్బాల్ తో సహా అతని కుటుంబ సభ్యులు రూపాలిని బురఖా ధరించాలని బలవంతం చేస్తున్నారు.
దీంతో రూపాలి గత కొన్ని నెలలుగా ఇక్బాల్ షేక్ తో విడిపోయి తన కుమారుడితో విడిగా ఉంటోంది. అయితే సెప్టెంబర్ 26న విడాకులపై మాట్లాడాలని రూపాలని పిలిచాడు ఇక్బాల్. రాత్రి 10 గంటలకు ఇద్దరు కలుసుకుని విడాకులతో మాట్లాడుతున్న సమయంలో కొడుకు ఎవరి వద్ద ఉండాలనే దానిపై ఇద్దరి మధ్య వాగ్వాదం నిడిచింది. దీంతో పాటు గతంలోని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఇక్బాల్, రూపాలిని సందులోకి తీసుకెళ్లి కత్తితో చాలా సార్లు పొడిచాడు. తీవ్రగాయాలైన ఆమె అక్కడిక్కడే మరణించిందని పోలీసులు వెల్లడించారు. ముంబై తిలక్ నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 302 హత్యానేరం కేసులు పెట్టి విచారిస్తున్నారు.
