NTV Telugu Site icon

Most Expensive City: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై.. తర్వాతి స్థానాల్లోని నగరాలు ఇవే..

Mumbai

Mumbai

Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది. ప్రవాసుల కోసం అత్యంత ఖరీదైన భారతీయ నగరంగా మొదటిస్థానంలో ముంబై నిలిచింది. హాంకాంగ్ ప్రపంచవ్యాప్తంగా తొలిస్థానంలో ఉంది.

ర్యాంకింగ్స్ ప్రకారం, గ్లోబల్ ర్యాంకింగ్‌లో ముంబై 147, న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213 స్థానాల్లో ఉన్నాయి. ముంబయి ఆసియా నగరాల్లో ఒక స్థానం దిగజారి, అంతకుముందు సంవత్సరం (2022)తో పోలిస్తే 27వ స్థానానికి చేరుకుంది. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే గృహాలు, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, ఎంటర్టైన్మెంట్ సహా 200 కన్నా ఎక్కువ వస్తువుల తులనాత్మక ధర ఆధారంగా ర్యాంకులు కేటాయించింది.

Read Also: Coromandel Express: ఒడిశాలో ఘోర ప్రమాదం తర్వాత మళ్లీ పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్..

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అంతర్జాతీయ ఉద్యోగులకు హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ అత్యంత ఖరీదైన నగరాలు అని నివేదిక పేర్కొంది. అతి తక్కువ ఖరీదైన నగరాల జాబితాలో హవానా, పాకిస్తాన్ లోని కరాచీ, ఇస్లామాబాద్ నగరాలు ఉన్నాయి. భారతీయ నగరాల్లో, ముంబైతో పాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే నగరాల్లో సర్వే చేశారు. ముంబై కన్నా ఇతర నగరాలు ప్రవాసులకు 50 శాతం తక్కువ వసతి ఖర్చులను కలిగి ఉన్నాయి. కోల్‌కతా ప్రవాసుల వసతికి అత్యంత తక్కువ ధరను కలిగి ఉంది. ప్రవాసులకు అనుకూలమైన ధరలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.

షాంఘై, బీజింగ్ మరియు టోక్యో వంటి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే భారతీయ నగరాలైన ఢిల్లీ, ముంబై వంటి నగరాలు తక్కువ ఖర్చులతో విదేశీ కార్యకలాపాలను అందించేందుకు ఎంఎన్సీ సంస్థలు పోటీపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, మారుతున్న క్రమం పాక్షికంగా కరెన్సీ అస్థిరత, యూరప్ ప్రాంతాల్లో వస్తువులు మరియు సేవల ధరల ద్రవ్యోల్బణ పెరుగుదల కారణంగా ప్రభావితమవుతుంది, ఇది భారతీయ నగరాల మొత్తం ర్యాంకింగ్‌లను తగ్గించడంలో పాత్ర పోషించిందని ఇండియాలో మెర్సర్ ప్రతినిధి రాహుల్ శర్మ తెలిపారు.

బెంగళూరు, న్యూఢిల్లీ, పుణె, చెన్నైలలో ఇళ్ల అద్దెలు 5 నుంచి 7 శాతం వరకు పెరిగాయని.. అయితే, హైదరాబాద్ మరియు కోల్‌కతాలో అద్దె రేట్లు దాదాపు 2-3 శాతం శ్రేణిలో మధ్యస్తంగా పెరిగాయని సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మద్యం ధరలు పెరిగాయని, ఈ విభాగంలో చెన్నైలో అత్యధిక ధరలు ఉన్నాయని సర్వే తెలిపింది.