మేఘాలయ టీఎంసీ ఛీఫ్‌గా ముకుల్ సంగ్మా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITMC)లో మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్ ముకుల్ సంగ్మా చేరారు. శుక్రవారం షిల్లాంగ్‌లో జరిగిన టీఎంసీ పార్టీ కొత్తగా ఏర్పడిన మేఘాలయ యూనిట్ తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముకుల్ సంగ్మాతో సహా మొత్తం 12 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఉమ్రోయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే జార్జ్ బి లింగ్డో మీడియాకు తెలిపారు.
డాక్టర్ ముకుల్ సంగ్మా నేతృత్వంలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, AITMC చీఫ్ మమతా బెనర్జీని కలవనున్నట్లు ఉమ్రోయ్ ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ ముకుల్ సంగ్మా నేతృత్వంలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం (నవంబర్ 25) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం టీఎంసీలో చేరారు. ఈ మేరకు మేఘలాయ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ కూడా సమర్పించారు. 12 మంది ఎమ్మెల్యేలు TMCలో చేరడంతో, 60 మంది సభ్యులు గల మేఘాలయ అసెంబ్లీలో ఆ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
