NTV Telugu Site icon

Mukesh Ambani: కుమారుడి పెళ్లిలో హిందూ వివాహ ప్రాముఖ్యతను వివరించిన ముఖేష్

Mukeshambani

Mukeshambani

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లిలో కన్యాదానం గురించి నీతా అంబానీ మాట్లాడినప్పుడు.. అతిథులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్త్రీ యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా తెలియజేశారు. దీంతో ఆమెను అతిథులంతా చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: Breaking: తన విడాకులను కన్ఫామ్ చేసిన హార్దిక్..

తాజాగా ముఖేష్ అంబానీకి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. కుమారుడి పెళ్లిలో అతిథుల ముందు హిందూ వివాహ వ్యవస్థను గురించి తెలియజేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహంలో భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయక అనుభూతిని అతిథులకు తెలియజేశారు. నూతన జంటను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ముఖేష్ ఏం చెప్పారో మీరు కూడా చూసేయండి.

Show comments