Site icon NTV Telugu

Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర తొలగింపు..

Mughals Now Out Of Syllabus

Mughals Now Out Of Syllabus

Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ, ఉత్తర ప్రదేశ్ బోర్డులు మొఘలుల చరిత్రను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మొఘలులు చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలు సిలబస్ లో భాగం కావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి అత్యున్నత సలహా సంస్థ ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో పలు పాఠ్యాంశాలను సవరించింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించి మధ్యయుగపు పాఠ్యపుస్తకాల నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’ అండ్ ‘ ది మొఘల్ కోర్ట్స్’ అధ్యాయాలను తొలగించారు.

Read Also: Paripurnanada : హిందువులకు మాత్రమే ఆధార్ కార్డులివ్వాలి..

విద్యార్థులకు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను ఉపయోగించి బోధన చేస్తామని ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చెప్పారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి కొత్త సిలబస్ ఆధారంగా పాఠాలు చెబుతామని యూపీ విద్యాధికారులు ప్రకటించారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో కూడా సిలబస్ మారింది ‘రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్‌మెంట్స్’, ఇండియాలో సోషలిస్ట్, కమ్యూనిస్టుల పార్టీ పెరుగుదల, స్వాతంత్య్రానికి ముందు కాంగ్రెస్ పాలనకు సంబంధించిన చరిత్రను సవరించారు.

10,11వ తరగతి పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు చేశారు. 10వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో ‘ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం’, ‘ప్రజాపోరాటాలు మరియు ఉద్యమాలు’’ అధ్యాయాలు, 11వ తరగతి చరిత్ర పుస్తకాల్లో నుంచి ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, ‘సంస్కృతుల మధ్య ఘర్షణ’ అనే అధ్యాయాలను తొలగించబడ్డాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) దాని సిలబస్ ను మార్చాలని 2022లో భావించింది. దీనికి అనుగుణంగానే తాజాగా మార్పులు చోటు చేసుకున్నాయి.

Exit mobile version