Site icon NTV Telugu

RBI MPC Meeting: కీలకం కానున్న ఎంపీసీ మీటింగ్‌.. వడ్డీ రేట్లపై ఆతృతగా ఎదురు చూపు

Rbi

Rbi

RBI MPC Meeting: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొన్ని వ్యాపార లావాదేవీలు ఆధారపడి ఉంటాయి. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంతో ఆయా రంగాల్లో వ్యాపారం ఎక్కువగా సాగుతుందా? లేదా? అనేది స్పష్టమవుతుంది. అటువంటి రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒకటి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లప తీసుకునే నిర్ణయం మేరకు కొత్త ఇళ్ల కొనుగోళ్లు జరుగుతాయి. వడ్డీరేట్లను బట్టి గృహ రుణాలు తీసుకోవాలా? వద్దా? అనేది ఆలోచిస్తారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) భేటీ ప్రారంభమైంది. సమావేశం వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. కీలక వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. ఆగస్టు 10న గవర్నర్‌ శక్తికింత్‌ దాస్‌ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తారు.

Read alsoఫ Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?

దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు గతేడాది మే నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. అయితే చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ భేటీలో 6.25 శాతంగా ఉన్న రెపో రేటును కొంత మేరకు పెంచి 6.5 శాతానికి పెంచింది. ఫిబ్రవరి తర్వాత జరిగిన రెండు భేటీల్లోనూ ఆర్‌బీఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదు. ఈ నేపథ్యంలో ద్వైమాసిక భేటీలోనూ వడ్డీ రేట్లలో పెంపు ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన తరుణంలో కీలకంగా పరిగణించే రెపో వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యథాతథంగా ఉంచే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, భౌగోళికంగా ఉన్న అనిశ్చితుల కారణంగా వడ్డీ రేట్లులో ఆర్‌బీఐ ఎటువంటి మార్పులు ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల పెరిగి టమాటా ధరలు కూడా ఎంపీసీ భేటీపై ప్రభావం చూపబోవని మరికొందరు చెబుతున్నారు. వడ్డీ రేట్లు స్థిరంగా కానసాగిస్తే వ్యక్తిగత, గృహ రుణాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు.

Exit mobile version