NTV Telugu Site icon

Pathan Controversy: పఠాన్ వివాదం.. ప్రవక్తపై మధ్యప్రదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

Speaker On Besharam Song

Speaker On Besharam Song

MP Speaker Girish Gautam Challenges Shah Rukh Khan On Pathan Row: ‘బేషరం రంగ్’ అనే పాట ఎప్పుడైతే విడుదల అయ్యిందో.. అప్పటి నుంచి ‘పఠాన్’ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ పాటలో దీపికా పదుకొనె వేసుకున్న కాషాయ దుస్తులు.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ విమర్శిస్తున్నారు. ఈ సినిమానే బ్యాన్ చేయాలని పట్టుబడుతున్నారు. రాజకీయ నేతలు సైతం రంగంలోకి దిగి.. ఆ సీన్లు తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, సినిమాని విడుదల చేయనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురితో కలిసి ఈ సినిమా చూడాలని, ఇలాంటి సినిమానే ప్రవక్తపై కూడా తీయాలని షారుఖ్‌కి ఛాలెంజ్ చేశారు.

Karnataka-Maharashtra border row: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లో హై టెన్షన్.. 144 సెక్షన్ విధింపు

స్పీకర్ గిరీశ్ గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘షారుఖ్ ఖాన్ తన కూతురితో కలిసి ఈ సినిమా చూడాలి. తన కూతురితో కలిసి పఠాన్ సినిమాను చూసినట్టు.. ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రపంచానికి తెలియజేయాలి’’ అని డిమాండ్ చేశారు. సినిమాలలో అలాంటివి (దీపికా వేసిన కాషాయ దుస్తులు) ఏమాత్రం ప్రోత్సాహించకూడదని పేర్కొన్నారు. మీకు ఏది అనిపిస్తే, ఆ పని చేయడం సరైంది కాదన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘మహమ్మద్ ప్రవక్తపై ఇలాంటి సినిమా చేయాలని నేను బహిరంగంగా చెప్తున్నాను. భావాప్రకటన స్వేచ్ఛ పేరుతో ఆ సినిమాను విడుదల చేయాలని కోరుతున్నాను. అలా చేస్తే.. ప్రపంచమంతటా రక్తపాతం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లోనూ తాము ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని, పఠాన్‌ని థియేటర్లలో విడుదల అవ్వకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రూలింగ్ బీజేపీ ఈ అంశంపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తుందని తెలిపారు.

Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్

అంతకుముందు.. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఆయన.. బేషరం రంగ్ అనే పాట టైటిల్, దాని అర్థం అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ఈ పాట‌లో ఉన్న కాస్ట్యూమ్‌ క‌లుషిత‌మైన మైండ్‌సెట్‌ను చాటుతుంద‌ని ఆరోపించారు. పాటలో కొన్ని మార్పులు చేయాలని.. లేకపోతే ఈ సినిమాని విడుదల చేయకుండా బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరితో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పఠాన్‌ సినిమాను వ్యతిరేకిస్తున్నారు.