NTV Telugu Site icon

Rahul Gandhi: పోలీసులు అదుపులో రాహుల్ గాంధీ.. కీలక నేతల అరెస్ట్

Rahul Gandhi

Rahul Gandhi

MP Rahul Gandhi detained during protest: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈ రోజు మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించనుంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, కీలక నాయకులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈడీ కేసుతో పాటు ధరలపెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కాంగ్రెస్ మార్చ్ ను అడ్డుకోవడంతో నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ రహదారిపై కూర్చున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతదేశం పోలీస్ రాజ్యంగా మారిందని.. నరేంద్రమోదీ రాజు తరహాలో వ్యవహరిస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, దీపేందర్ హుడాలను కూడా అరెస్ట్ చేశారు
పోలీసులు.

Read Also: CPEC: పాక్, చైనాలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

పోలీసులు సూచనల మేరకే..నిరసన తెలుపుతున్నామని.. ఇదంతా ప్రతిపక్షాల పూర్తి నాశనం చేయాలని.. గొంతులనను మూయించేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కుట్ర చేశారని.. మేం దేనికి భయపడబోమని.. మా పోరాటం కొనసాగుతుందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం, అగ్నిపథ్, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఎజెన్సీలను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని దీనిపై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని.. దీనిపై రాజ్ ఘాట్ లో నిరసన తెలుపుతామని చెప్పినప్పటికీ అనుమతించలేదని.. రాష్ట్రపతికి మెమోరాండం ఇస్తామన్నా.. పోలీసులు అనుమతించడం లేదని దీపక్ హుడా విమర్శించారు.