Site icon NTV Telugu

MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..

Pritipatel

Pritipatel

MP Priti Patel: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత చర్యని పలు దేశాలు సమర్థిస్తున్నాయి. తాజాగా, బ్రిటీష్ ఎంపీ ప్రీతి పటేల్ భారత్‌కి మద్దతు ప్రకటించారు. భారతదేశంతో కలిసి ఉగ్రవాద నిరోధక సహకారాన్ని బలోపేతం చేయాలని యూఎస్ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి సరిహద్దు ఉగ్రవాద ముప్పుని గుర్తించాలని యూకేని కోరారు.

‘‘ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మంది పర్యాటకుల్ని క్రూరంగా హత్య చేశారు. ఇది అనాగరికమైన, క్రూరమైన హింసాత్మక చర్య. చాలా మంది బాధితులను తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చి చంపారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి’’ అని ఆమె అన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలంటూనే, పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపుల నుంచి ఎదుర్కొంటున్న ముప్పుని యూకే గుర్తించాలని ప్రతీ పటేల్ అన్నారు.

Read Also: Operation Sindoor: ‘‘ఎవరైనా భారత్ వ్యతిరేక ప్రచారం చేశారో..’’ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే సహేతుకమై చర్యలు తీసుకునే హక్కు భారత్‌కి ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదులు భారత్ దేశం, పాశ్చాత్య ప్రయోజనాలను బెదిరిస్తారని మాకు తెలుసు’’ అని ఆమె అన్నారు.
ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం, భారత్‌పై సుదీర్ఘకాలం నుంచి ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తున్న చరిత్ర కలిగిన దేశం అని పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మిత్ర దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆమె యూకే పార్లమెంట్‌లో చెప్పింది.

కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత యూకే భారతదేశానిక ఏదైనా నిర్దిష్ట భద్రతా సహాయం అందించిందా..? ఉద్రిక్తతల్ని నివారించేందుకు బ్రిటన్ నిర్దిష్ట మద్దతు అందించగలదా..? అని ఆమె అడిగారు. పహల్గామ్ దాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌తో లష్కరేతోయిబా సంబంధాలు, ఇటీవల వారితో హమాస్ నేతలు సమావేశమైన నివేదికల్ని ప్రీతి పటేల్ చర్చించారు.

Exit mobile version