NTV Telugu Site icon

MP Pragya Thakur: ఇళ్లల్లో కత్తులు ఉంచుకోండి.. ఎప్పుడైనా అవసరం పడుతుంది

Pragya Thakur Knives

Pragya Thakur Knives

MP Pragya Thakur Calls Hindus To Keep Weapons In Homes: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకెక్కే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమని తాము రక్షించుకోవడం కోసం హిందూ సమాజం తమ ఇళ్లల్లో పదునైన ఆయుధాలు పెట్టుకోవాలని, అవి ఎప్పుడైనా అవసరం పడతాయని సూచించారు. ఒకవేళ ఆయుధాలు లేకపోతే.. కనీసం కూరగాయాలను కోసే కత్తులనైనా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కర్ణాటక శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్‌ రీజియన్ వార్షిక సదస్సులో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే హక్కు హిందువులకు ఉందని చెప్పారు.

Unstoppable 2: బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ షురూ…

ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములని అంతం చేయాలి. అలా చేయకపోతే.. నిజమైన ప్రేమకు నిర్వచనం లభించదు. లవ్ జిహాద్‌తో సంబంధం ఉన్న వారితో కూడా అదే విధంగా ప్రవర్తించండి. మీ ఆడబిడ్డలకు సరైన విలువలు నేర్పించి, వారిని కాపాడుకోండి’’ అంటూ పిలుపునిచ్చారు. శివమొగ్గకు చెందిన హిందూ కార్యకర్త హర్ష హత్యకు గురైన విషయం తనకు తెలిసిందని, దేశంలోని ప్రతీచోటా హిందువుల పట్ల ఇలాగే జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. హిందువులు తమ స్వీయ రక్షణ కోసం, ఇళ్లల్లో పదునైన ఆయుధాలు ఉంచుకోవాలని అన్నారు. లేకపోతే.. కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా పదును చేసి, సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. ఎవరైనా దాడికి దిగితే, వారికి తగిన రీతిలో సమాధానం ఇవ్వడం మన హక్కు అని చెప్పారు.

Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..

అలాగే.. ఇంట్లో పూజలు చేయాలని, ధర్మం & శాస్త్రం గురించి చదవాలని ప్రగ్యా ఠాకూర్ పిలుపునిచ్చారు. హిందూ సాంప్రదాయాలను, విలువలను పిల్లలకు నేర్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని మిషనరీ స్కూళ్లలో చేర్పించొద్దని, అలా చేస్తే మీరంతా వృద్ధాశ్రమంలో బతకాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మీ పిల్లలు మీకు దక్కకుండా పోతారని, స్వార్థపరులుగా మారి సంస్కృతుల్ని సైతం పక్కన పెట్టేస్తారని చెప్పారు. ఈ విధంగా ప్రగ్యా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Show comments