Madhya Pradesh: మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ అనే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 19వ శతాబ్దపు సామాజిక సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్‌ను ‘‘బ్రిటిష్ ఏజెంట్’’గా పిలిచారు. అగర్ మాల్వాలో జరిగిన బిర్సా ముండా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించడానికి బ్రిటిష్ వారి తరుపున పనిచేసినట్లు ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో బెంగాల్‌లో ఆంగ్ల విద్యా ద్వారా మతమార్పుడులు జరుగున్నాయని, బ్రిటిష్ వారు రాయ్‌తో సహా అనేక మంది సంఘ సంస్కర్తల్ని బాలిసలుగా చేశారని అన్నారు. బిర్సాముండా ఈ చర్యల్ని విచ్చిన్నం చేసి గిరిజన గుర్తింపు, సమాజాన్ని రక్షించారని పర్మార్ అన్నారు.
Read Also: Tata Sierra: టాటా సియెర్రా, మరో ‘‘ నెక్సాన్’’ కాబోతోందా..
పర్మార్ కామెంట్స్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. పార్టీ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఈ వ్యాఖ్యల్ని సిగ్గుచేటు అని అన్నారు. ‘‘సతి’’ రద్దు కూడా బ్రిటీష్ బ్రోకరేజా..? అని ప్రశ్నించారు. బ్రిటిష్ వారికి ఏజెంట్లుగా ఉన్నవారు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారని ఆయననున విమర్శించారు. పర్మార్ తన వ్యాఖ్యలతో వివాదాలు రేపడం ఇది తొలిసారి కాదు. భారతదేశాన్ని వాస్కోడాగామా కనుగొనలేదని, చందన్ అనే వ్యాపారి కనుగొన్నాడని ఆయన అన్నారు. చరిత్రలో మనకు తప్పుగా నేర్పించారని చెప్పారు.
