Site icon NTV Telugu

MP R Krishnaiah: రాజకీయ లబ్ధి కోసమే EWS రిజర్వేషన్లు

Bc Leader

Bc Leader

సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు EWS (Economically Weaker Sections) రిజర్వేషన్లు సమర్ధించడం విచారకరం అన్నారు రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య. గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది. అలాంటప్పుడు 5 గురు సభ్యుల ధర్మాసనం దీని మీద ఎలా తీర్పు ఇస్తుంది? 11 మంది సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో తీర్పును సవాలు చేస్తాం అన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కల్పించడం కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ వైఖరి. రాజకీయ లబ్దికోసమే ఈ EWS రిజర్వేషన్లను తీసుకొచ్చారని మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య.

రిజర్వేషన్లు అంటే పేదరిక నిర్మూలన పథకం కాదు. వెనకబడిన వర్గాలకు అధికారం ఇవ్వడం గౌరవం దక్కేలా చేసేందుకే రిజర్వేషన్లు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. అలాంటప్పుడు అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ లు ఇస్తే బిసిలకు ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ తగ్గుతుంది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం EWS రిజర్వేషన్లపై పునరాలోచించాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Read Also: Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కోహ్లీ.. కెరీర్‌లోనే తొలిసారి

ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని సీజేఐతో (CJI) నలుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కీలక తీర్పుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. నలుగురు రాజ్యాంగ బద్దత వుంటుందని చెబితే, ఒకరు మాత్రం విభేదించారు. జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల కోటా చెల్లుబాటు అవుతుందని కోర్టు పేర్కొంది.ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు సంబంధించి 2019లో మోడీ ప్రభుత్వం 103వ రాజ్యాంగసవరణ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Harish Rao: మెరుగైన వైద్యం పేదలకు అందించాలి

Exit mobile version