Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…
- శివపురి జిల్లా కోలారస్ తహసీల్‌లోని పిరోంత్ గ్రామంలో ఘటన
- సోదరి మరిదితో అక్క ప్రేమ, పెళ్లి
- చంపేస్తామంటున్న యువతి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు మానవ సంబంధాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో అస్సలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. ఎవరు, ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నారో కూడా అర్థం కాని రోజులివి.. ఏకంగా చెల్లి మరిదినే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది….
పూర్తి వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కోలారస్ తహసీల్‌లోని పిరోంత్ గ్రామానికి చెందిన ఒక యువతి తన సొంత సోదరి మరిదితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబం సభ్యులకు చెప్తే.. వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి, అబ్బాయి ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి కుటుంబం ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆమె భర్తను, అత్తమామలను చంపేస్తామని బెదిరిస్తోంది. భయపడిన ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. తనకు తన భర్తకు, తన అత్తమామలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతూ వీడియో పెట్టింది.
Also Read
పిరోంత్ నివాసి అయిన జగదీష్ కుష్వాహా కుమార్తె వందన వయసు 20 సంవత్సరాలు. ఆమె తన సోదరి అత్ఘారింటికి తరచుగా వెళ్లేది. ఈ సమయంలో ఆమె తన సోదరి మరిది, సర్జాపూర్ కోలారస్ నివాసి అయిన జోఖురామ్ కుష్వాహా కుమారుడు కరణ్ తో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబాలకు తమ ప్రేమ విషయం చెప్పగా, వాళ్లు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సెప్టెంబర్ 10న ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీంతో వందన కుటుంబం కరణ్ ఇంటికి చేరుకుని, కరణ్ కుటుంబంతో పాటు వందన, కరణ్‌ను చంపేస్తామని బెదిరించింది.
తన కుటుంబం వల్ల ఇబ్బంది పడుతున్న వందన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తామిరిద్దరం ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని, కానీ తన కుటుంబ సభ్యులు తన అత్తమామలను కొడుతున్నారని, వారిద్దరూ కూడా ప్రమాదంలో ఉన్నారని ఆమె చెప్పింది. వందన కరణ్‌తో ఒక వీడియో చేసి షేర్ చేసినప్పుడు, ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో వందన తన కుటుంబ సభ్యులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, దానిని నమోదు చేయవద్దని పోలీసులను అభ్యర్థించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు