India: మతస్వేచ్ఛపై అమెరికాకు చెందిన సంస్థ ఇచ్చిన రిపోర్టుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) యొక్క తాజా నివేదికని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నివేదికపై విదేశాంగ మంత్రిత్వ శఆఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. భారతదేశం గురించి వాస్తవాలను తప్పుగా చూపిస్తోందని, ఇది ‘‘ప్రేరేపిత కథనాన్ని’’ ప్రోత్సహిస్తోందని అన్నారు.
Read Also: Mexican: మెక్సికో సైనికుల కాల్పులు.. భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి
“యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF)పై మా అభిప్రాయాలు అందరికీ తెలుసు. ఇది రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత సంస్థ. ఇది వాస్తవాలను తప్పుదారి పట్టించడం మరియు భారతదేశం గురించి ప్రేరేపిత కథనాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తుంది” అని జైశ్వాల్ అన్నారు. ఈ ద్వేషపూరిత నివేదికను ప్రభుత్వం తిరస్కరించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక USCIRF మరింత అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇలాంటి ‘‘ఎజెండా-ఆధారిత’’ ప్రయత్నాలను కొనసాగించడం మానుకోవాలని జైశ్వాల్ సదరు సంస్థకు హితవు పలికారు. ముందుగా USCIRF అమెరికాలోని మానవహక్కులపై దృష్టి పెడితే మంచిదని భారత్ చురకలంటించింది. భారత్ పలు సందర్భాల్లో ఈ సంస్థ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది పక్షపాత వైఖరిని కలిగి ఉందని విమర్శించింది.