రోజురోజుకూ మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. అన్నదమ్ముల మధ్య.. తల్లిదండ్రుల మధ్య.. ఇలా రక్తసంబంధాలు దెబ్బతింటున్నాయి. తమ సుఖం కోసం రక్తబంధాన్ని తెంచుకోవడం కోసం ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ మాతృమూర్తి. ఈ దారుణం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 28 ఏళ్ల అంజలి భర్త నుంచి విడిపోయింది. అనంతరం ఆమె
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె అజ్మీర్‌కు వెళ్లి ఒక హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. ఆమె ప్రియుడు అల్కేష్ కూడా అక్కడే పని చేస్తున్నాడు. అయితే మొదటి భర్త ద్వారా ఆమెకు 3 ఏళ్ల కావ్య సింగ్ అనే కుమార్తె ఉంది. అయితే పడక సుఖానికి చిన్నారి అడ్డుగా ఉందంటూ అల్కేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. పదే పదే గొడవ పెట్టుకోవడంతో చిన్నారిని వదిలించుకోవాలని అంజలి డిసైడ్ అయింది. అంతే అజ్మీర్‌లోని అనా సాగర్ సరస్సుకు అర్ధరాత్రి తీసుకెళ్లి విసిరేసింది. దీంతో చిన్నారి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. అయితే మంగళవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా హెడ్‌కానిస్టేబుల్ గోవింద్ శర్మ.. నడుచుకుంటూ వెళ్తున్న మహళను, వ్యక్తిని ప్రశ్నించాడు. మార్గమధ్యలో తన కుమార్తె తప్పిపోయిందని అంజలి అబద్ధం చెప్పింది. దీంతో పోలీసులు వీడియో ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితురాలు అంజలి సరస్సు దగ్గర తిరుగుతున్నట్లు కనిపించింది. దీంతో ఆమెను గట్టిగా నిలదీయగా నేరాన్ని అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: దక్షిణాదికొస్తే కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిండి.. దుమారం రేపుతోన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
ఇక బుధవారం ఉదయం సరస్సులో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నేరాన్ని తానే చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తన ప్రియుడు అల్కేష్‌కు సంబంధం లేదని తెలిపింది. అయితే అల్కేష్ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవ్వడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చింది. అంజలిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇందులో ప్రియుడు అల్కేష్ పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తుచేస్తున్నారు.
ఇది కూడా చదవండి:Rahul Gandhi: ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఓట్లు తొలగిస్తున్నారు
