Site icon NTV Telugu

Teenage pregnancy: ఆందోళకరంగా, టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..

Teenage Pregnancy

Teenage Pregnancy

Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.

జిల్లాల వారీగా చూసుకుంటే.. బెంగళూరు అర్బన్‌లో అత్యధికంగా 4,324 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. విజయనగర్ (2,468 కేసులు), బళ్లారి (2,283), బెలగావి (2,224), మరియు మైసూరు (1,930) జిల్లాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సామాజిక పరిస్థితులు, సోషల మీడియా, ఇంటర్నెట్ వినియోగం, సమగ్రమైన లైంగిక విద్య లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణమని నివేదిక వెల్లడించింది.

Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన

కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ నాగన్న గౌడ మాట్లాడుతూ.. టీనేజర్లు అనుచితమైన కంటెంట్‌కి గురికావడంలో సోషల్ మీడియా పాత్రను నొక్కి చెప్పారు. ఇది వారి జీవిత ప్రారంభంలోనే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందని చెప్పారు. ‘‘టీనేజర్లు తరుచుగా ఆన్‌లైన్‌లో చూసే వాటి ద్వారా ప్రభావితమవుతారు. హఠాత్తు నిర్ణయాలు వారి సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇది ఊహించని విధంగా గర్భాలకు దారితీస్తోంది’’ అని అన్నారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. వార్షిక టీనేజ్ గర్భధారణ కేసుల్ని సూచించింది. 2021-22లో 11,792 కేసులు ఉండగా, 2022-23లో అది 13,198కి పెరిగింది, ఆ తర్వాత 2023-24లో 8,631కి తగ్గింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఎన్జీవోలు, ఇతర సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Exit mobile version