Site icon NTV Telugu

Karnataka: కర్ణాటకలో విషాదం.. గోదాములో ధాన్యం బస్తాల కింద చిక్కుకున్న 10 మందికి పైగా కార్మికులు.. ఏడుగురు మృతి..

Untitled 10

Untitled 10

కర్ణాటకలో విషాదం వెలుగు చూసింది. బ్రతుకు దెరువుకు బీహార్ నుండి కర్ణాటకకు వలస వచ్చిన కార్మికులు మృత్యువాత పడ్డారు. వివరాల లోకి వెళ్తే.. కర్ణాటక లోని విజయపుర లోని రాజ్‌గురు ఇండస్ట్రీస్‌ లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విషాదం వెలుగు చూసింది. సోమవారం రాత్రి గోదాములో స్టోరేజీ యూనిట్‌ కూలిపోయింది. దీనితో ఆ సమయంలో కార్మికులు కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు మొక్కజొన్న బస్తాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బస్తాల కింద చిక్కుకున్న కార్మికులలో ముగ్గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Read also:Cyclone Michuang Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం!

కాగా 7 మంది కార్మికులు చనిపోయారు. కాగా వారిలో 6 మంది మృత దేహాలను బస్తాల కింద నుండి అతి కష్టం పైన బయటకు తీశారు. మృతులు రాజేష్ ముఖియా (25), రాంబ్రీజ్ ముఖియా (29), శంభు ముఖియా (26), లుఖో జాదవ్ (45), రామ్ బాలక్ (52)గా గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయిన రాజ్‌గురు ఇండస్ట్రీస్‌లో కార్మికులు విధుల్లో ఉండగా ప్రమాధవశాత్తు స్టోరేజీ యూనిట్‌ కూలిపోయిందని.. ఈ నేపథ్యంలో మొక్కజొన్న బస్తాలతో కూడిన అనేక సెట్ల నిల్వ యూనిట్లు ఒకేసారి పడిపోవడంతో 10 మంది కార్మికులు ఆబస్తాల కింద చిక్కుకున్నారని.. అయితే చుకుకున్నవారిలో ఊపిరిరాడక 7 మంది మృతి చెందారని.. ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించామని వెల్లడించారు. కాగా కార్మికులందరూ బీహార్ కి చెందివారుగా పేర్కొన్నారు.

Exit mobile version