PM Modi: బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి ఒక నెలపాటు ప్రభుత్వ పథకాలను తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు.
Read Also: Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ సహాయకుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కొడుకుతో సంబంధాలు..
మాతృభూమి కోసం పనిచేయాలని పార్టీ నాయకులకు మోదీ పిలుపునిచ్చారు. విషపూరిత రసాయనాలతో భూమాత కలుషితం అవుతోందని, చెట్ల పెంచడం ద్వారా మెరుగుపరచాలని సూచించారు. రాజకీయ నాయకులు రాజకీయేతర అంశాలపై పనిచేయాలని, ఇది సమాజంపై చాలా ప్రభావం చూపిస్తాయని ఆయన అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘‘ బేటీ బచావో ’’ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడిందని ప్రధాని అన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతలను నేర్చుకోవానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ ఎంపీలను కోరారు. తెలియకపోవడం టెక్నాలజీని ఉపయోగించుకోకపోవడానికి కారణం కాకూడదని ప్రధాని అన్నారని తెలియజేశారు. గుజరాత్ ఎన్నికలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు వల్ల ప్రతిపక్షాలు మరింతగా దాడి చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు.