వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. కాగా, కరోనా మహమ్మారి విజృంభణతో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిర్వహించిలేదు.. పార్లమెంట్ సిబ్బంది, ఎంపీలు చాలా మంది కోవిడ్ బారినపడడంతో.. అర్థాతంగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై విమర్శలు చేశాయి ప్రతిపక్షాలు.. ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి సమావేశాలను దాదాపు 4 వారాల పాటు నిర్వహించేందుకు కేబినెట్ కమిటీ సూచించింది… కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో.. తగిన చర్యలు తీసుకుంటూ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని పేర్కొంది. పార్లమెంటు సభ్యులందరూ ఫేస్ మాస్క్‌లు ధరించాలి మరియు ఆవరణలో భౌతికదూరం నిబంధనలను పాటించాలని.. సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు.. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా తీసుకోవాలని కమిటీ సూచించింది.. ఇక, ఇప్పటివరకు, లోక్‌సభలోని 540 మంది సభ్యులలో 403 మంది సభ్యులు, రాజ్యసభలో 232 మందిలో 179 మంది సభ్యులు రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.. మిగతా వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది.