Site icon NTV Telugu

Monsoon: గుడ్‌న్యూస్.. 4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Monsoon

Monsoon

భారత వాతావరణ శాఖ ఈసారి దేశ ప్రజలకు ముందుగానే తొలకరి వాన కబురు చెప్పింది. ప్రతి ఏటా జూన్‌లో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో నైరుతు రుతుపవనాలు కేరళలో ప్రవేశించబోతున్నాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

ఇది కూడా చదవండి: Abhishek Banerjee: దౌత్య బృందంలోకి మేనల్లుడు! యూసఫ్ పఠాన్‌కు షాక్!

నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్‌లో రుతుపవనాలు విస్తరించాయని.. మరో నాలుగైదు రోజుల్లో అత్యంత త్వరగా కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరించనున్నాయి.

ఇది కూడా చదవండి: YS Jagan: పేర్లు రాసిపెట్టుకోండి.. మన టైం వస్తుంది.. అన్యాయం చేసినవారికి సినిమా చూపిస్తాం..!

వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది శుభవార్తే. అలాగే అన్నదాతలు కూడా వర్షాలు కోసం ఎదురుచూస్తు్న్నారు. ఈ ఏడాది త్వరగానే రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జలాశయాలు కూడా అడుగంటాయి. త్వరగా వర్షాలు పడితే జలాశయాలు నిండుకుంటాయి.

Exit mobile version