NTV Telugu Site icon

Monkeypox: కేంద్రం కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ అభివృద్ధికి టెండర్ల ఆహ్వానం

Monkeypox

Monkeypox

Monkeypox Cases In India: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 78 దేశాల్లో 18 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళకు చెందిన ముగ్గురితో పాటు.. ఢిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో మొదటిసారిగా మంకీపాక్స్ వైరస్ ను పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వేరు చేసింది. ఈ పరిశోధన వల్ల వ్యాధి నిర్థారణ కిట్ల తయారీ, వ్యాక్సిన్ తయారీ వేగంవంతం కావడానికి ముందడుగు పడినట్లు అయింది.

తాజాగా మంకీపాక్స్ కు వ్యతిరేకంగా టీకాలు, వ్యాధి నిర్థారణ కిట్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల తయారీకి టెండర్లను ఆహ్మానించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సినియర్ అధికారి వెల్లడించారు. తాజాగా ఐసీఎంఆర్-ఎన్ఐవీ పూణే రోగుల నమూనాల నుంచి మంకీపాక్స్ వైరస్ ను వేరుచేసి కల్చర్ చేసింది. ఇది పశ్చిమాఫ్రికా జాతితో 99.85 శాతం సరిపోయిందని అధికారులు వెల్లడించారు.

Read Also: Cheating Bridegrooms: ఊరి ఊరికో నిత్యపెళ్ళికొడుకులు.. ఒకడు 13.. మరొకడు5

ప్రస్తుతం మంకీపాక్స్ పై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మంకీపాక్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పాటు మంకీపాక్స్ వ్యాధి నిర్థారణ కోసం 15 ల్యాబులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ తయారీకి కేంద్ర పచ్చజెండా ఊపింది. మంకీపాక్స్ సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ కేసుల్లో 3-6 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.