Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: “రామ్ లల్లాను చూసేందుకు హనుమంతుడు వచ్చాడు”.. కోతి సందర్శనపై ఆలయ ట్రస్ట్..

Ayodhya

Ayodhya

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఆశ్చర్యకరమైన ఘటన ఎదురైంది. కొత్తగా ప్రారంభమైన రామ మందిరంలోకి కోతి ప్రవేశించింది. గర్భగుడిలోని రామ్ లల్లా విగ్రహం వరకు వెళ్లింది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించింది.

Read Also: INDIA bloc: మమతా బెనర్జీ తర్వాత, కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన ఆప్..

సమీపంలోని భద్రతా సిబ్బంది, విగ్రహం భద్రత గురించి ఆందోళన చెంది కోతి వైపు పరిగెత్తారు. కొంత సమయం తర్వాత కోతి ఉత్తర ద్వారం గుండి బయటకు వెళ్లాలని ప్రయత్నించింది, అయితే అది మూసివేసి ఉంది. తర్వాత భక్తలకు ఎలాంటి హాని కలిగించకుండా తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్లింది.

ఈ పరిణామాన్ని చూసిన భక్తులు, ఆలయ సిబ్బంది స్వయంగా హనుమంతుడే కోతి రూపంలో వచ్చి రాముడి దర్శనం చేసుకున్నాడని చెబుతున్నారు. కోతి సందర్శనను దైవానుగ్రహంగా భావిస్తు్న్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. కోతులను హనుమాన్ అవతారంగా భావిస్తారు. అక్టోబర్ 30, 1990లో కరసేవకులు బాబ్రీ మసీదు గోడపై కాషాయ జెండాను పెట్టిన సమయంలో ఒక కోతి జెండాకు రక్షణ నిలవడాన్ని పలువరు గుర్తు చేసుకుంటున్నారు.

Exit mobile version