Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి వేడుకలు, ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సమాజంలో ఐక్యత, భారతీయ సంస్కృతి, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, యువతలో నైతిక విలువలు వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. విదేశాల్లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వాల మార్పుల ప్రభావం గురించి కూడా ప్రస్తావించారు.
విజయదశమి సందర్భంగా మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం స్మృతి మందిరంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1925లో విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఈ నేపథ్యంలో సంఘ్ తన శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా పథ సంచలన కార్యక్రమాలను నిర్వహించడం ఆర్ఎస్ఎస్ సంప్రదాయంగా కొనసాగుతోంది.
Also Read
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
- LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
రాజ్ నారాయణ్ బసు, సంత్ రవిదాస్ సేవలను గుర్తుచేసిన భగవత్
తన ప్రసంగంలో మోహన్ భగవత్ బెంగాల్‌కు చెందిన రాజ్ నారాయణ్ బసు సేవలను ప్రస్తావించారు. ప్రజలకు తమ సంస్కృతి, గుర్తింపుపై అవగాహన కల్పించేందుకు ఆయన హిందూ మేళాను ప్రారంభించారని పేర్కొన్నారు. అనంతరం సంత్ రవిదాస్ సేవలను గుర్తుచేస్తూ, విదేశీ దండయాత్రలు, అణచివేతలతో సమాజంలో భయాందోళనలు నెలకొన్న సమయంలో ఆయన మత విశ్వాసం, సామాజిక సామరస్యం, భక్తి సందేశాలను అందించారని తెలిపారు. తన బోధనలు, జీవితంతో ప్రజల్లో ధైర్యాన్ని నింపారని వివరించారు.
ఐక్యతతోనే దేశం బలోపేతం
గత వందేళ్లుగా భారతదేశాన్ని దాని స్వీయ గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఏకీకృతం చేసి బలోపేతం చేసేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని మోహన్ భగవత్ అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, భారతీయ సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించడం వంటి అంశాలకు సంఘ్ శతాబ్ది సంవత్సరంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భారతదేశం అనేక భాషలు, ప్రాంతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు, ఆచారాలు కలిగిన వైవిధ్యభరితమైన దేశమని పేర్కొన్నారు. భిన్నత్వం ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలో భారతదేశం ఐక్యతతో పురోగమించిందని, భవిష్యత్తులోనూ అదే మార్గంలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సృష్టిలో వైవిధ్యం సహజమని, సమస్త అస్తిత్వంలోని ఏకత్వం శాశ్వతమైన సత్యమని ఆయన వివరించారు.
ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో నిరసనలపై వ్యాఖ్యలు
పశ్చిమ దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రస్తావిస్తూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్, అల్బేనియా, నేపాల్, బంగ్లాదేశ్‌లలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలని అన్నారు. ప్రభుత్వాలను మార్చడం ద్వారా పరిస్థితులు మారిపోతాయని భావించడం సరైనది కాదని, గతంలోనూ ప్రభుత్వాల మార్పుతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదని వ్యాఖ్యానించారు. సమాజంలోని మర్యాద, క్రమశిక్షణ, సంస్కృతిని వ్యతిరేకించే ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజాన్ని, దేశాన్ని సక్రమంగా ముందుకు నడిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఐక్యత లక్ష్యంగా జరిగే ఉద్యమాలు సమాజానికి మేలు చేస్తాయని, అయితే ఇతరులపై వ్యతిరేకతను పెంచేందుకు ఉద్యమాలను ఉపయోగిస్తే అవి రాజకీయ సాధనాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులను దేశాన్ని బలహీనపరచాలనుకునే శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని హెచ్చరించారు ఆర్ఎస్ఎస్ చీఫ్..
యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం
ఇక, యువతకు కీలక సూచనలు చేశారు భగవత్.. నేటి యువతలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన మాదకద్రవ్యాల వ్యసనాన్ని తీవ్రమైన సమస్యగా అభివర్ణిస్తూ, చిన్న వయసు నుంచే పిల్లలకు దాని దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. యువత మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. కొత్త తరానికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉందని, వివిధ అంశాల పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. అయితే, ఏది సమాజానికి మేలు చేస్తుంది, ఏది హాని కలిగిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరమని తెలిపారు. ఈ విషయంలో కుటుంబాలు, సమాజం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఓటీటీ, ఇతర మీడియాపై క్రమశిక్షణ అవసరం
మరోవైపు.. ఓటీటీ వేదికలు, ఇతర మీడియా కంటెంట్‌కు సంబంధించి నియంత్రణలు, క్రమశిక్షణ అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. మీడియా ప్రభావంతో వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, సామాజిక వాతావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా తగిన అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, ఆర్ఎస్ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన విజయదశమి వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. దసరా రోజున ఆయుధ పూజ నిర్వహించడం సంఘ్‌లో కొనసాగుతున్న సంప్రదాయం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పథ సంచలన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలు సంఘ్ క్రమశిక్షణ, సంస్థాగత ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!