ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 7న నుంచి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో ఐదు రోజులు కోల్‌కతాలో బస చేస్తుండగా.. మిగతా ఐదు రోజులు బుర్ద్వాన్‌లో గడుపుతారని వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పది రోజుల పర్యటనలో కీలక పరిణామాలుంటాయని తెలుస్తోంది. ఆఫీస్ బేరర్లు, ప్రచారక్‌లతో విస్తృత సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం..
మోహన్ భగవత్.. బెంగాల్‌లో అనేక మార్లు పర్యటించారు. అయితే ఈ పర్యటన చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. మోహన్ భగవత్ టూర్‌పై స్థానిక ఆర్‌ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉల్లాసంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో మహిళలు, పురుషులు పాల్గొంటారు. వేర్వేరు శాఖల వారిని కూడా కలవనున్నారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా బెంగాల్‌లో నెలకొన్న రాజకీయాలు, ఎలా పని చేయాలి. ప్రజల కోసం ఎలా నిలబడాలి అన్నదానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 16న ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీలో మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. అనేక అంశాలను ప్రస్తావించనున్నారు. ఆర్‌ఎస్ఎస్‌కు జంగల్‌మహల్, దక్షిణ బెంగాల్‌లో మంచి పట్టుకుంది. అయితే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పర్యటన బాగా కలిసొస్తుందని ఆర్ఆర్ఎస్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Mrunal – Dulquer : మరోసారి జతకట్టనున్న సీతారామం జంట.. ఈ సారి వేరే లెవల్