Site icon NTV Telugu

Mohan Bhagwat: ‘‘భారత వృద్ధిని చూసి భయపడుతున్నారు’’..ట్రంప్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్..

Mohanbhagwat

Mohanbhagwat

Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. పరోక్షంగా స్పందిస్తూ.. భారత వృద్ధికి భయపడే వారు అలాంటి చర్యలు తీసుకుంటారని అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిరాశ నుంచి ఈ చర్యలు వచ్చాయని అన్నారు.

Read Also: Goa Minister: తల్లిని ప్రేమించని రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా ప్రేమిస్తాడు..?

గత నెలలో ట్రంప్ సర్కార్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. ఇందులో 25 శాతం పరిస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి ఆయిల్ కొంటూ ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా రష్యాకు సహకరిస్తున్నారని చెబుతూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు. ఈ సుంకాలను భారత్ అన్యాయం, అసమంజసమైనవిగా పేర్కొంది.

ఈ సుంకాలపై భగవత్ మాట్లాడుతూ.. ‘‘భారత్ బలంగా మారితే తమకు ఏం జరుగుతుందో, వారి స్థానాలు ఎలా మారుతాయో అని ప్రపంచం భయపడుతుంది. అందుకే భారతీయ వస్తువులపై సుంకాలు విధిస్తున్నారు’’ అని అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌లోని యోగా ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రం అయిన బ్రహ్మకుమారీస్ విశ్వశాంతి సరోవర్ 7వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచ సమస్యలకు పరిస్కాలను అందించగల, ప్రపంచాన్ని పురోగతి వైపు నడిపించే సామర్థ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతదేశం గొప్పదని, భారతీయులు గొప్పగా ఉండటానికి కృషి చేయాలని, భారత్ గొప్పగా ఎదగాలని కోరుకున్నారు.

Exit mobile version