Site icon NTV Telugu

Mohammed Shami: షమీకి మద్దతుగా దేశం.. జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై ఆగ్రహం..

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.

Read Also: Mohammed Shami: మహ్మద్ షమీ “క్రిమినల్”.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం.. ఏమైందంటే..

అయితే, ఇప్పుడు దేశం మొత్తం షమీకి మద్దతుగా నిలుస్తోంది. షమీ కజిన్ డాక్టర్ ముంతాజ్ మాట్లాడుతూ..‘‘అతను దేశం తరపున ఆడుతున్నాడు. ‘రోజా’ను పాటించని పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు, వారు మ్యాచ్‌లు ఆడుతున్నారు, కాబట్టి ఇది కొత్తేమీ కాదు. షమీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఈ విషయాలను పట్టించుకోవద్దని, మార్చి 9న జరిగే మ్యాచ్‌కు సిద్ధం కావాలని మేము మహ్మద్ షమీకి చెబుతాము’’ అని అన్నారు.

మరోవైపు, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొందరు మనుషులు ‘‘ ఫత్వాలు జారీ చేసే దుకాణాలు’’ తెరుస్తున్నారు. కూరగాయల వలే ఫత్వాలను అమ్ముతున్నారు. అయితే, ఎవరూ కూడా వారి ఫత్వాలను కొనడం లేదు. వారంతా మూర్ఖులు’’ అని అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో షమీ, రోజాను పాటించలేదని షాబుద్దీన్ విమర్శలు చేశారు.

Exit mobile version