Mohali Building Collapse: పంజాబ్‌లో కుప్పుకూలిన మూడంతస్తుల భవనం.. 15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్
- పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో కుప్పకూలిన మూడు అంతస్థుల భవనం..
- శిథిలాల కింద చిక్కుకున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి దృష్టి వర్మ..
- భవన యజమానులపై పోలీస్ కేసు.. ఘటనపై సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohali Building Collapse: పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పుకూలిపోయింది. దీంతో సహాయక చర్యలు 15 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి దృష్టి వర్మ మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు కొనసాగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: German Christmas Market: జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో ఏడుగురు భారతీయులకు గాయాలు..
Also Read
కాగా, 3 అంతస్థుల భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు సంఘటన ప్రదేశానికి వచ్చాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చి.. అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. అయితే, ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు భవనం కూలిపోవడంపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డింగ్ కూలిపోవడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
-Sohana Building Collapse Update-
Rescue Operation Continues;
District Admin Sets Up Control Room +91 172-2219506,
Civil Hospital Mohali, Fortis, Max and Sohana Hospital put on alert pic.twitter.com/UjRsI4G0Zh— DC Mohali (@dcmohali) December 21, 2024
తాజావార్తలు
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!