Site icon NTV Telugu

Mohali Building Collapse: పంజాబ్‌లో కుప్పుకూలిన మూడంతస్తుల భవనం.. 15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్

Punjab

Punjab

Mohali Building Collapse: పంజాబ్‌ రాష్ట్రం మొహాలి జిల్లాలో 3 అంతస్తుల బిల్డింగ్ కుప్పుకూలిపోయింది. దీంతో సహాయక చర్యలు 15 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి దృష్టి వర్మ మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్‌మెంట్‌ కోసం తవ్వకాలు కొనసాగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం శిథిలాల కింద 10 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: German Christmas Market: జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో ఏడుగురు భారతీయులకు గాయాలు..

కాగా, 3 అంతస్థుల భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు సంఘటన ప్రదేశానికి వచ్చాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చి.. అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. అయితే, ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు భవనం కూలిపోవడంపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డింగ్ కూలిపోవడంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version