Modi’s swearing-in: ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ రికార్డును పునరావృతం చేస్తున్నది మోడీ మాత్రమే. ఈరోజు మోడీ నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జేడీయూ నేత నితీష్ కుమార్ వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతిని కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని సమాచారం.
జూన్ 8 ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘8’వ తేదీనే మోడీ ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
న్యూమరాలజీలో ‘8’ ప్రాముఖ్యత:
న్యూమరాలజీ ప్రకారం ‘8’ కి చాలా ప్రాముఖ్యతు ఉంది. ఇది శని గ్రహాన్ని సూచిస్తుంది. 8 న్యాయానికి చిహ్నంగా కూడా ఉంది. ఎనిమిదవ సంఖ్య ‘‘రాజ్యయోగానికి’’ చిహ్నం. ఇది వేద జ్యోతిష్యపరంగా శుభమైన సంఖ్యగా చెప్పబడుతోంది. సాధారణంగా ఎవరి జాతకంలో అయితే, శని మంచి స్థానంలో లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నట్లైతే విజయం ఆలస్యం అవుతుంది. కానీ, వచ్చే విజయం చాలా హైలెవల్‌లో ఉంటుంది. శని ఆలస్యానికి కారకుడి చెప్పబడుతున్నప్పటికీ, ఆయన ఆలస్యంగా ఇచ్చే విజయం మాత్రం అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
మోడీ అధికారం చేపట్టిన మొదటిసారి అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటైన పెద్ద నోట్ల రద్దు ‘డిమానిటైజేషన్’’ నవంబర్ 8 రాత్రి 8 గంటలకు ప్రకటించారు. సెప్టెంబర్ 26, 2015లో డిజిటల్ ఇండియా డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో 2+6=8ని సూచిస్తుంది.2015 సంవత్సరం కూడా 2+0+1+5=8ని సూచిస్తుంది. ప్రధాని మోడీ సెప్టెంబర్ 17న జన్మించారు. ఇందుల్లో తేదీ 1+7=8ని సూచిస్తుంది.
కొన్ని సందర్భాల్లో పుట్టిన తేదీతో సంబంధం లేకుండా ఎవరికైనా ఏ సంఖ్య అయినా అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుందని, 8వ తేదీన జన్మించిన వారికి మాత్రమే విజయం వరిస్తుందని చెప్పలేమని న్యూమరాలజిస్ట్‌లు చెబుతున్నారు. యాదృచ్చికంగా ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం కూడా ‘8’వ తేదీన జరుగుతోంది. దీంతో ఈ సంఖ్యపై అంతా ఆసక్తి నెలకొంది.
