Site icon NTV Telugu

విపక్షాలు అభివృద్ధిని తరిమేయడానికి పనిచేశాయి: ప్రధాని మోడీ

తర్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తు ముందుగానే ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఈజోరు హోరందుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య ప్రముఖంగా పోరు ఉండనుంది. ఇదిలా ఉంటే గురువారం ఉత్తరాఖండ్‌లో రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Read Also:కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర

అక్కడ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. విపక్షాలు అభివృద్ధిని తరిమేయడానికి పనిచేశాయని, ప్రగతి దిశగా ఎప్పుడు అడుగులు వేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్దే అంజెండాగా సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తుందని మోడీ అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ముందస్తుగానే ఆయా పార్టీలు రెడీ అవుతున్నాయి. బీజేపీ సైతం ఒక్క అడుగు ముందుకేసి అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టడంతో పాటు ఎన్నికల ప్రచారం సైతం కలిసి వస్తుందనే ఆలోనలో బీజేపీ ఉంది.

Exit mobile version