చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. చూసేందుకు సాధారణ దృశ్యాల మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రముఖులు వాటిని ట్వీట్ చేయడం వలన వైరల్ అవుతుంటాయి. గుజరాత్‌లోని భావనగర్ రోడ్డును జింకలు వరసగా దాటుతున్న వీడియోను గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వేలావదర్ జాతీయ జింకల పార్కు నుంచి సుమారు 3 వేలకు పైగా జింకలు ఒకేసారి రోడ్డుమీదకు వచ్చాయి. అలా వచ్చిన జింకలు వరసగా రోడ్డును దాటుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్వీట్ చేసిన ఈ వీడియోను ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్‌లెంట్ అని మెచ్చుకుంటూ రీట్వీట్ చేశారు. మోడీ రీట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది.
మోడీ ట్వీట్ చేసిన జింకల వీడియో… వైరల్…
