Site icon NTV Telugu

US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్‌పింగ్” ఫోటో..

Modi Putin

Modi Putin

US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా చర్చ జరిగింది.

ఇదిలా ఉంటే.. మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి ఉల్లాసంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. అమెరికన్, వెస్ట్రన్ మీడియాలు ఈ సమావేశాలకు ఎనలేని కవరేజ్ అందించాయి. మరోవైపు, ముగ్గురు అధినేతల కలయిక అమెరికాను కలవరపరుస్తోంది. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలతో భారత్-అమెరికా సంబంధాలు కుదుపులకు గురయ్యాయి. ఇంకో వైపు చైనా, భారత్ తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు అంగీకరించాయి.

Read Also: Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్‌పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..

ఈ నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో గురించి అమెరికా రాజకీయ నిపుణుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని అన్నారు. ‘‘ ఈ రోజు మనం చారిత్రాత్మక అతిపెద్ద విషయాన్ని తిరిగి చూస్తున్నాము. ఇది చరిత్రలో కీలక మలుపు. ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ సంకేతం. ఆధిపత్యం ఆసియా దేశాలదే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది బహుళ ధ్రువ ప్రపంచాన్ని సూచిస్తుందని సీఎన్ఎన్‌తో జోన్స్ అన్నారు. వీరి ముగ్గురి కలయిక అమెరికాకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు.

ఇదిలా ఉంటే, అమెరికన్ మీడియా కూడా ఈ ముగ్గురు నేతల కలయికను హైలెట్ చేసింది. అమెరికా వ్యతిరేక అక్షంగా వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ‘‘ట్రంప్ సుంకాలతో భారత్‌ను దూరం చేయడాన్ని కొనసాగించాలని ఎంచుకుంటే, సరిహద్దు సమస్యలు ఉన్నా చైనాతో కలిసి వేరే మిత్రులు ఉన్నారని మోడీ చూపిస్తున్నారు’’ అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఎస్‌సీఓ సమావేశం యూఎస్ ప్రపంచ నాయకత్వానికి సవాలుగా మారిందని సీఎన్ఎన్ తెలిపింది.

Exit mobile version