ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తేంటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహచర మంత్రులకు ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలు మన బలాన్ని చూశాయని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Indian Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ బుకింగ్ సమయంలో ఈ-ఆధార్ తప్పనిసరి
ఇక జూన్ 9తో ఎన్డీఏ-3 ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరించాలని కేంద్రమంత్రులకు మోడీ సూచించారు. చేసిన పనులు, ప్రాజెక్టులు గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. అనవసరంగా గత ప్రభుత్వాలతో పోలికలు పెట్టుకోవద్దని కోరారు. ఆ సమయం అయిపోయింది.. ఇంకా పోలికలు పెట్టడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: AB Venkateswara Rao: లాసెట్ రాసిన రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్..
గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకోవడానికి రోజులు పట్టేవని.. ఇప్పుడు అలా కాదని.. కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించేసినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లో తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. మన లక్ష్యాలు పెద్దవి.. సమయం తక్కువగా ఉందని.. అందుకే శ్రద్ధగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్లో నాణ్యత, సామర్థ్యం, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని కోరారు. ప్రపంచం మనల్ని గమనిస్తోందని.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.
ఇక అన్ని మంత్రిత్వ శాఖలు త్వరలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ విస్టా సచివాలయానికి మారతాయని మోడీ వెల్లడించారు. దీంతో సమయం ఆదాతో పాటు మంత్రిత్వ సమన్వయం కూడా సానుకూలంగా ఉంటుందని వివరించారు.
ఎన్డీఏ సర్కార్ 3.0 ఏర్పడి జూన్ 9 నాటికి ఏడాది పూర్తికానుంది. దీంతో మోడీ 11 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగడం విశేషం. ఇక 2027లో జనాభా లెక్కలు, కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 22 నిమిషాల్లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఇలా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది.
