NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: మోడీతో చాలా మాట్లాడా.. అవి ఏంటో చెప్పలేను

Modi, Komatireddy Venkat Reddy

Modi, Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: మోడీకి చేతులెత్తి విన్నవించానని, అలసిపోయి మీ వద్దకు వచ్చానని తెలిపా అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లీలో ప్రధాని మోడీతో మాట్లాడిన అనంతరం మీడియాతో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. అప్పాయింట్మెంట్ అడగ్గానే ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి అంశాలతో పాటూ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించానని అన్నారు. మూసి కలుషితం అయి, ప్రజలకు ప్రమాదంగా మారిందని తెలిపారు. మూసిని ప్రక్షాళన చెయ్యాలని కోరానని అన్నారు. గతంలో సబర్మతి పరిస్థితి ఇలాగే ఉండేది.. ఇపుడు ప్రక్షాళన చేశారని అన్నారు. గంగను క్లీన్ చేస్తున్నారని అన్నారు. మూసి వల్ల కోటి మందికి పైగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని విస్తరించాలని కోరానని తెలిపారు. హైదరాబాద్ నుంచి జనగామ వరకు ఎంఎంటీఆఎస్‌ నడపాలని కోరానని అన్నారు.

Read also:Supreme Court : సుప్రీం సీరియస్.. లంచగొండి అధికారులపై కనికరం అక్కర్లేదు

రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వటం లేదని, ముఖ్యమంత్రి ని అపాయింట్మెంట్ అడుగుతా! అన్నారు. సీఎం అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల గతంలో సీఎస్ ను అడిగానని పేర్కొన్నారు. భువనగిరి, జనగామ లను మోడల్ రైల్వేస్టేషన్ లుగా మార్చాలని కోరారు. తెలంగాణ లో సర్ ప్లస్ బడ్జెట్ ఉంది కదా అని మోడీ అడిగారని, అన్ని మీకు తెలుసు.. అలసిపోయి మీ వద్దకు వచ్చాను అని చేతులెత్తి విన్నవించానని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. రాజకీయాల గురించి ఇపుడు మాట్లాడను.. వెంకట్ రెడ్డికి పార్టీలో ఏ పోస్ట్ లేదని అన్నారు. ఎంపీగా మాత్రమే ఉన్నానని, ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతా! అన్నారు. ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యే గా పోటీ చేస్తానా అనేది చెప్తానని అన్నారు. రాజకీయాలపై మాట్లాడనని, ప్రధానితో చర్చించిన కొన్ని అంశాలు చెప్పలేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.