యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా అమలవుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పేరును మార్చాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో పథకం పేరు మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (MGNREGA)గా ఉన్న పేరును ‘‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ బిల్లు 2025’’గా మార్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించవచ్చని శుక్రవారం ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు జీవన భృతి కల్పించేందుకు గత యూపీఏ హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటిగా ఉంది. డిసెంబర్ 12న మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పథకం పేరు మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ పథకం పేరు మారుస్తున్నట్లుగా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా విద్యా రంగాన్ని కూడా సంస్కరించే లక్ష్యంతో వికాస్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు-2025ను కూడా ఆమోదించే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: Lok sabha: రుజువుందా? ఈ-సిగరెట్ వివాదంపై టీఎంసీ నిలదీత
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల వేతనంతో కూడిన పథకంగా అమలవుతోంది. సామాజిక తనిఖీల తర్వాత వేతనాలు చెల్లిస్తుంటారు. కోవిడ్ సమయంలో ఈ పథకం చాలా మందికి మేలు చేసింది. పెద్ద సంఖ్యలో ఈ పథకంపై ఆధారపడ్డారు. ఇంటికి దగ్గరలోనే పని కల్పిస్తుంటారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: ఎమ్మెల్యేలకు డీకే.శివకుమార్ విందు.. ఏం జరుగుతోంది!?
