ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ ఇవాళ సాయంత్రం కొలువుదీరనుంది.. కేబినెట్ విస్తరణలో 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. వీరిలో కేబినెట్ మంత్రులుగా ప్రమోట్ అయిన ఏడుగురు సహాయ మంత్రులు కూడా ఉన్నారు.. ఇదే సమయంలో ఐదుగురు కేంద్ర మంత్రులను తొలగిస్తున్నారు ప్రధాని మోడీ… ఈ విస్తరణ తర్వాత కేబినెట్‌లో 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ వర్గానికి చెందిన మంత్రులు ఉండనుండగా.. 27 మంది ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగులు) మంత్రులు ఉంటారు. ఐదుగురు మైనార్టీ వర్గానికి చెందినవారు ఉండనుండగా.. కేబినెట్‌లో మొత్తం 11 మంది మహిళా మంత్రులు ఉంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం హర్దీప్ సింగ్ పురి, అనురాగ్ ఠాగూర్, కిషన్ రెడ్డి, రూపాలా, కిరణ్ రిజుజు సహాయ మంత్రులుగా ఉన్నారు.. ఇక, దబశ్రీ చౌధురి గంగవర్, సదానంద గౌడ్, పోక్రియాల్ రాజీనామా చేశారు.. కేబినెట్ మంత్రుల విద్యార్హతలు పరిశీలిస్తే.. మొత్తం ఏడుగురు.. సివిల్ సర్వెంట్స్ ( IAS, IPS లాంటి అఖిల భారత సర్వీసుల)కు చెందిన వారికి అవకాశం దక్కింది.. ఐదుగురు ఇంజనీర్లు. ఆరుగురు డాక్టర్లు, 13 మంది లాయర్లు ఉండనున్నారు.. కర్ణాటక నుంచి నలుగురికి అవకాశం దక్కనుంది.. మరోవైపు.. మంత్రుల సగటు వయస్సు 56 కాగా, 50 ఏళ్ల లోపు ఉన్న మంత్రుల సంఖ్య 14గా ఉంది. ఆరుగురికి కేబినెట్ హోదా దక్కనుండగా.. గతంలో రాష్ట్రాలలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు 18 మంది ఉన్నారు.. మొత్తం మంత్రులలో 68 మంది పట్టభద్రులు కాగా, ముగ్గురు ఎంబీఏ డిగ్రీలు, ఏడుగురు పి.హెచ్.డి లు పొందినవారు ఉన్నారు.12 మంది ఎస్సీ మంత్రులలో ఇద్దరికి క్సాబినెట్ హోదా దక్కనుండగా.. 8 మంది ఎస్టీ మంత్రులలో ముగ్గురికి కేబినెట్ హోదా.. 25 మంది ఓబీసీ మంత్రులలో.. ఐదుగురికి కేబినెట్ హోదా.. ఇక, ఐదుగురు మైనార్టీల మంత్రులుండగా.. అందులో ముగ్గురికి కేబినెట్ హోదా దక్కనుంది. కేబినెట్‌లో కొత్త ముఖాలు చూస్తే.. దర్శన్ జరదోష్, మహారాష్ట్ర నుంచి డాక్టర్. భారతి పవార్, కపిల్ పాటిల్, భగవత్ కారాద్, నారాయణ రాణే, యు.పి నుంచి బి.ఎల్. వర్మ, కౌశల్ కిషోర్, ఎస్.పి. సింగ్ బఘేల్, అజయ్ మిశ్రాకు అవకాశం దక్కనుంది.