Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రతిపక్షానికి భయపడే మోడీ కులగణనకు ఓకే చెప్పారు

Rahulgandhi

Rahulgandhi

ప్రతిపక్షానికి భయపడే ప్రధాని మోడీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీహార్‌లోని మిథిలా యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించేందుకు దర్భాంగా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. అయినా కూడా రాహుల్‌గాంధీ యూనివర్సిటీకి చేరుకుని ప్రసంగించారు. బీహార్ పోలీసులు తనను ఆపేందుకు ప్రయత్నించారని.. కానీ విద్యార్థుల శక్తి ముందు తనను ఎవరూ ఆపలేకపోయారన్నారు. జనాభా గణన నిర్వహించాలని కేంద్రాన్ని కోరాం.. కానీ బలహీనవర్గాల ఒత్తిడికి కులగణన ప్రకటించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనార్టీలకు వ్యతిరేకం అన్నారు. ఈ ప్రభుత్వం అదానీ-అంబానీ ప్రభుత్వం అన్నారు. కేంద్రంలో.. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతివారికి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా బీహార్‌లో యువత తలపెట్టిన ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. మిథిలా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే కారును అడ్డుకున్నారు. అందరి అభిమానం ముందు తనను ఎవరూ అడ్డుకోలేకపోయారని రాహుల్ గాంధీ అన్నారు.

ఇది కూడా చదవండి: WTC Prize Money: WTC ఛాంపియన్స్‌, రన్నరప్‌కు రికార్డు బద్దలు కొట్టే ప్రైజ్ మనీ.. ఐసీసీ ప్రకటన

 

Exit mobile version