Site icon NTV Telugu

మ‌రో వ్యాక్సిన్ దిగుమ‌తికి గ్రీన్ సిగ్న‌ల్‌…

క‌రోనా మ‌హమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది.  దేశంలో ప్ర‌స్తుతం మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  రోజుకు ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయితే, డిమాండ్‌కు స‌రిప‌డిన‌న్ని వ్యాక్సిన్లు లేక‌పోవ‌డంతో అత్య‌వ‌స‌ర వినియోగం కింద మ‌రో వ్యాక్సిన్ ను దిగుమ‌తి చేసుకోవ‌డానికి అనుమ‌తులు ల‌భించిన‌ట్టు స‌మాచారం.  క‌రోనా మ‌హమ్మారిపై స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇండియాలో దిగుమ‌తి, అమ్మకాల కోసం  ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ సిప్లా డీసీజీఐ కు ధ‌ర‌ఖాస్తు చేసుకోగా, అనుమ‌తులు మంజూరు చేసిన‌ట్లు స‌మాచారం.  90శాతం స‌మ‌ర్ధ‌త క‌లిగిన రెండు డోసుల ఈ వ్యాక్సిన్‌కు ఇప్ప‌టికే కెన‌డా, అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాల్లో వినియోగిస్తున్నారు.  అటు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ నుంచి కూడా ఈ వ్యాక్సిన్‌కు అమోదం ల‌భించింది.  ఈ ఏడాది చివ‌రినాటికి దేశంలో అంద‌రికి వ్యాక్సిన్ అందివ్వాల‌నే లక్ష్యంతో కేంద్రం ప‌నిచేస్తున్న‌ది.  

Exit mobile version