Site icon NTV Telugu

Big Breaking: చివరి నిమిషంలో ట్విస్ట్‌.. నేను రాలేనంటూ కవిత లేఖ

Dhilhi Kavitha

Dhilhi Kavitha

Big Breaking: ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరుఅవుతానని లేఖలో పేర్కొన్నారు కవిత. ఢిల్లీలో ఏంజరగుతుందో అని ఎదురుచూస్తున్న వారందరికీ కవిత ఈడీ విచారణకు నేను రాలేనంటూ లేఖ రాయడంతో అందరికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఒక్కక్షణంలో కవిత ఈడీ ముందు హాజరు అవుతుందని నిర్ణయాలు తారుమారు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: Midhunam: టాలీవుడ్ లో మరో విషాదం…

ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. కాగా.. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉన్నారు ఎప్పటికప్పుడు లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక.. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడంపై కవిత న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే… బుధవారమే (15)న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తక్షణమే దీన్ని విచారించాలని అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ కోర్టు ఆమె రిక్వస్ట్‌ను తిరస్కరించింది. ఈనేపథ్యంలో ఇవాళ్టి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంటికే వెళ్లి విచారించాలని రూల్స్ ఉన్నాయని, దీనికి వ్యతిరేకంగా తనను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించిందని సుప్రీం కోర్టుకు తెలిపారు కవిత. అంతేకాకుండా మరో తేదీ చెప్పాలని అప్పుడు కచ్చితంగా విచారణకు హాజరవుతారని రిక్వస్ట్ చేశారు కవిత. అయితే.. దీనిపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు వేచి చూడాలి.
Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!

Exit mobile version